Arjun Ram Meghwal : అర్జున్ రామ్ మేఘ్వాల్ కీల‌క కామెంట్స్

న్యాయ వ్య‌వ‌స్థ ప్ర‌భుత్వం క‌లిసి ఉండ‌డం ముఖ్యం

Arjun Ram Meghwal : మోదీ స‌ర్కార్ అనూహ్యంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజును త‌ప్పించింది. ఆయ‌న స్థానంలో పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాలు చూస్తున్న అర్జున్ రామ్ మేఘ్వాల్ ను న్యాయ శాఖ మంత్రిగా నియ‌మించింది. ఇది ఊహించ‌ని ప‌రిణామం. ఇంకా కొద్ది కాలంలోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు రానున్నాయి. ఈ త‌రుణంలో నిత్యం వివాదాస్ప‌ద కామెంట్స్ తో కిరెన్ రిజిజు కొంత ఇబ్బందిక‌రంగా మారారు. ప్ర‌స్తుతం కేంద్రానికి న్యాయ వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య సఖ్య‌త లేదు. ఇటీవ‌ల ప‌లు కేసుల‌లో కేంద్రాన్ని త‌ప్పు ప‌ట్టింది. అంతే కాకుండా గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల తీరు , ఇలా ప్ర‌తి దానిని త‌ప్పు ప‌డుతూ వ‌చ్చింది భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం.

అంతే కాదు కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ నియామ‌క విష‌యంలో కేంద్రంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆపై కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ను ఆగ మేఘాల మీద నియ‌మించ‌డంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. అంతే కాకుండా కేంద్రానికి సంబంధించి ఉన్న‌త పోస్టుల‌లో నియ‌మించే విష‌యంలో త్రిస‌భ్య క‌మిటీ ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌ధాని , ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, సీజేఐ తో కూడిన క‌మిటీ ఎంపిక చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

దీంతో కిరెన్ రిజిజు వ‌ల్ల న్యాయ వ్య‌వ‌స్థ‌కు కేంద్రానికి మ‌ధ్య అంత‌రం పెరుగుతుంద‌ని భావించారు మోదీ. ఆయ‌న‌కు ఉద్వాస‌న ప‌లికారు. వేరే అప్ర‌ధాన్య శాఖ‌ను అప్ప‌గించారు. తాజాగా న్యాయ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అర్జున్ రామ్ మేఘ్వాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న్యాయ వ్య‌వ‌స్థ‌తో, ప్ర‌త్యేకించి సీజేఐతో స‌త్ సంబంధాలు పెంపొందించుకునేలా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Nara Lokesh

Leave A Reply

Your Email Id will not be published!