Arpita Mukharjee : కారు దిగేందుకు అర్పితా ససేమిరా
ఈడీకి సహకరించని ముఖర్జీ
Arpita Mukharjee : అర్పితా ముఖర్జీ మోస్ట్ పాపులర్ అయి పోయారు. అడపా దడపా నటిగా పేరొందారు. స్వస్థలం పశ్చిమ బెంగాల్. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగింది.
ఆపై ఒకప్పుటి విద్యా శాఖ మంత్రి, తాజాగా కేబినెట్ నుంచి తొలగించబడిన పార్థ ఛటర్జీకి రైట్ హ్యాండ్. ఒకరకంగా చెప్పాలంటే అన్నీను. ఇంకేం గత ఎన్నికల నాటి నుంచీ కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘా పెంచింది.
విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిపిన టీచర్ల రిక్రూట్ మెంట్ లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంకేం అదును చూసి ఈడీ ఎంట్రీ ఇచ్చింది.
ఇంకేం మంత్రి పేరుతో వెనుక నుంచి చక్రం తిప్పుతూ వచ్చిన అర్పిత ముఖర్జీ బండారం బయట పడింది. ఆమెకు సంబంధించిన ఇళ్లల్లో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి.
లెక్కించ లేనంత డబ్బులు. ఎక్కడ చూసినా గదుల నిండా రూ. 500 , రూ. 2,000 నోట్ల కట్టలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆపై ఫ్లాట్ లో కూడా దాడులు చేశారు.
అక్కడ విస్తు పోయేలా నగదుతో పాటు ఏకంగా 5 కేజీల బంగారం బయట పడింది. దీంతో ఈ అమ్మడితో పాటు ఆమెకు సపోర్ట్ గా ఉంటూ వచ్చిన పార్థ ఛటర్జీని అరెస్ట్ చేశారు.
ఇక విచారణలో ఇద్దరూ నోరు విప్పడం లేదని సమాచారం. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం అర్పితను(Arpita Mukharjee) ఆస్పత్రికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసింది ఈడీ. కానీ కారు లో నుంచి దిగేందుకు ససేమిరా అందట. ఇంకేం బలవంతంగా తీసుకు వెళ్లారు ఈడీ అధికారులు.
Also Read : డ్రగ్స్..మద్యానికి అడ్డాగా మారిన గుజరాత్
"ED" Government formed in Maharashtra but Firecrackers in Bengal🔥
Look at Arpita Mukherjee's Condition👇pic.twitter.com/3Ql1OX6KW2
— The Analyzer (@Indian_Analyzer) July 29, 2022