President Murmu : మల్లన్న దర్శనం కోసం రానున్న ముర్ము
విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైన ఏపీ సర్కార్
President Murmu : భారత దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము(President Murmu) తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆమె డిసెంబర్ 26న హైదరాబాద్ కు రానున్నారు. మొదటిసారిగా ఏపీలో పర్యటించారు. అనంతరం తిరుమలను దర్శించుకున్నారు. తాజాగా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లలో మునిగింది.
మరో వైపు ఆమె ఇక్కడికి వచ్చిన వెంటనే నేరుగా ఏపీలోని ప్రసిద్ద దేవాలయం శ్రీశైలంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించు కోనున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లలో మునిగి పోయింది. ఇందులో భాగంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం టూర్ సందర్భంగా తనిఖీలు చేపట్టింది బాంబ్ స్క్వాడ్. సున్నిపెంటలో ట్రయల్ రన్ కూడా చేపట్టారు.
రాష్ట్రపతి డిసెంబర్ 26 సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలంకు విచ్చేస్తారు. రెండున్నర గంటల పాటు ఉంటారు. ఈ సందర్భంగా మల్లికార్జున, భ్రమరాంబ అమ్మ వారిని దర్శించుకుంటారు. అనంతరం 2.30 గంటలకు తిరిగి హైదరాబాద్ కు వెళతారు. ద్రౌపది ముర్ముకు చెంచులు స్వాగతం పలుకుతారు. వారితో కొంత సేపు సంభాషించనున్నారు.
పద్మావతి గెస్ట్ హౌస్ లో కొంత సేపు సేదదీరుతారు రాష్ట్రపతి.కర్నూలు జిల్లా ఎస్పీతో పాటు జాయింట్ కలెక్టర్ రాష్ట్రపతి టూర్ సందర్భంగా ఏర్పాట్లలో మునిగి పోయారు. ద్రౌపది ముర్ముకు(President Murmu) పూర్ణకుంభంతో స్వాగతం పలకనున్నారు.
ఇదిలా ఉండగా కరోనా కలకలం కారణంగా రాష్ట్రపతి టూర్ సందర్భంగా పాల్గొనే అధికారులు విధిగా కోవిడ్ టెస్టు చేయించు కోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆమెకు స్వాగతం పలికేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు.
Also Read : పోటెత్తిన జనం యాత్రకు బ్రహ్మరథం