Arun Singh : క‌న్న‌డ నాట మ‌ళ్లీ మాదే రాజ్యం

క‌ర్ణాట‌క రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్

Arun Singh : క‌న్న‌డ నాట మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. మ‌రో వైపు కాంగ్రెస్ కూడా ధీటుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఇదిలా ఉండ‌గా ఈసారి కూడా ఎలాగైనా స‌రే మ‌రోసారి కాషాయ జెండా ఎగుర వేయాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. ఇక్క‌డ గెల‌వాలంటే ముందుగా లింగాయ‌త్ క‌మ్యూనిటీని ప్ర‌సన్నం చేసుకోవాల్సి ఉంది. ఇప్ప‌టికే త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు కావాల‌ని భారీ ఎత్తున ఇటీవ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.

దీంతో ఏ ప్ర‌భుత్వం అధికారంలోకి రావాల‌న్నా దానిని డిసైడ్ చేసేది మాత్రం లింగాయ‌త్ లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా వీరిని ప్రస‌న్నం చేసుకునేందుకు గాను మాజీ సీఎం , సీనియ‌ర్ నాయ‌కుడు బీఎస్ యెడియూర‌ప్ప‌ను రంగంలోకి దించింది. ఇంకో వైపు ప్ర‌చారాన్ని వినూత్నంగా ప్రారంభించింది.

ఈసారి తాము ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ఆ పార్టీ క‌ర్ణాట‌క ఇన్ ఛార్జి అరుణ్ సింగ్(Arun Singh). రికార్డు స్థాయిలో సీట్లు గెలుచు కోబోతున్నామ‌ని అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పాత మైసూరు లో త‌మ‌కు గ‌ణ‌నీయంగా సీట్లు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు.

పంచాయ‌తీ నుంచి పార్ల‌మెంట్ దాకా కీల‌కంగా ఉన్న నేత‌ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ఉన్నామ‌ని పేర్కొన్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ క్షేత్ర స్థాయిలో ప‌ని చేస్తోంద‌న్నారు. కొంత కాలం నుంచే బూత్ స్థాయి నుంచే తాము ప‌ని చేస్తున్నామ‌ని తెలిపారు. ఇందులో అనుమానం అక్క‌ర్లేద‌న్నారు అరుణ్ సింగ్.

Also Read : రైల్వే బోర్డు చైర్మ‌న్ గా అనిల్ కుమార్

Leave A Reply

Your Email Id will not be published!