Arun Singh : యెడ్డీ సార‌థ్యం కాషాయం బ‌లోపేతం

రాష్ట్ర ఇన్ చార్జి అరుణ్ సింగ్ ప్ర‌క‌ట‌న

Arun Singh : క‌ర్ణాట‌క రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. క‌ర్ణాట‌క మాజీ సీఎం బీఎస్ యెడియూర‌ప్ప అనూహ్యంగా సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు.

ఆ త‌ర్వాత ఆయ‌న స్థానంలో బొమ్మై కొలువు తీరారు. ఆనాటి నుంచి నేటి దాకా ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టుగా ఉంటూ వ‌చ్చారు యెడియూర‌ప్ప‌. ఊహించ‌ని రీతిలో బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు లో కీల‌క‌మైన ప‌ద‌వి ఇచ్చింది యెడ్డీకి.

ఈ సంద‌ర్భంగా గురువారం అరుణ్ సింగ్(Arun Singh) యెడియూర‌ప్ప‌ను క‌లిశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. యెడియూర‌ప్ప అత్యంత అనుభ‌వం క‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే పార్టీ విస్త‌రిస్తుంద‌న్నారు.

యెడ్డీ పార్టీకి అద‌న‌పు బ‌లం. ఆయ‌నకు ప‌ద‌వి కేటాయించ‌డం తో అభినంద‌న‌లు తెలియ చేసేందుకు వ‌చ్చా. ఆయ‌న మాకంటే సీనియ‌ర్ నాయ‌కుడు. ద‌క్షిణాదిలో అత్యంత ప్ర‌భావం చేస్తున్న నాయ‌కులలో యెడియూర‌ప్ప ఒక‌డు.

నాలుగ‌సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం యెడ్డీ ఆధ్వ‌ర్యంలో దేశంలోని ద‌క్షిణాదిన అన్ని ప్రాంతాల‌కు బీజేపీ విస్త‌రిస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు అరుణ్ సింగ్.

ఇదిలా ఉండ‌గా సీనియ‌ర్ నేత‌లు అరుణ్ జైట్లీ, సుష్మా స్వ‌రాజ్ , వెంక‌య్య నాయుడు త‌ర్వాత ఏర్ప‌డిన ఖాళీల‌ను భ‌ర్తీ చేశారు పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా. పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీని త‌ప్పించారు.

ఆయ‌న‌ను తొల‌గించ‌డం విస్తు పోయేలా చేసింది. మ‌రో వైపు తెలంగాణ‌కు చెందిన ల‌క్ష్మ‌ణ్ కు రెండు క‌మిటీల‌లో చోటు ద‌క్కింది.

Also Read : స‌ర్కార్ ను కూల్చ‌డంలో గ‌వ‌ర్న‌ర్ బిజీ

Leave A Reply

Your Email Id will not be published!