Arvind Kejriwal : విద్యకు చేయూత భవిష్యత్తుకు భరోసా
స్పష్టం చేసిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆరు నూరైనా సరే విద్యా రంగాన్ని అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సోమవారం ఢిల్లీ లోని లిబాస్ పూర్ గ్రామంలో అద్భుతంగా నిర్మించిన ఆధునిక పాఠశాల భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం పదే పదే కావాలని అడ్డుకుందని, కానీ తాను ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఈ ప్రభుత్వ బడితో ఏ కార్పొరేట్ పాఠశాల పోటీ పడలేదని తాను ఘంటాపథంగా చెప్పగలనని అన్నారు. తాను చదువు కోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని, తన అంతిమ కల ఒక్కటే విద్యారంగం, ఆరోగ్య రంగం బాగు పడాలని అన్నారు.
ఇందులో భాగంగా విద్యార్థులు చదువుకునే వాతావరణం కల్పించడం, వారిని భావి భారత పౌరులుగా తీర్చి దిద్దడం, ఆధునిక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టానని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇవాళ యావత్ దేశం మొత్తం ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న అసాధారణమైన చర్యలను ప్రశంసిస్తున్నాయని చెప్పారు. తాము తీసుకు వచ్చిన మార్పులు భారీ ఎత్తున ఫలితాలు వచ్చేలా చేశాయని తెలిపారు ఢిల్లీ సీఎం.
ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇవాళ జేఈఈ ఫలితాల్లో అత్యధిక స్కోర్లు , ర్యాంకులు సాధించి గర్వ కారణంగా నిలిచారని కొనియాడారు. ఇంకా ఢిల్లీని ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.
Also Read : DK Shiva Kumar : ఈ మట్టికి..ప్రజలకు రుణపడి ఉన్నా