Arvind Kejriwal : ఢిల్లీ సీఎం పిటిషన్ పై హైకోర్టు తీర్పుకు సుప్రీంలో సవాల్

కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది....

Arvind Kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఇడి అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి చర్యలు తీసుకుంటోంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆప్ సర్కార్ యోచిస్తోంది. ఆప్ ఈ నిర్ణయంపై బుధవారం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనుంది.

Arvind Kejriwal Case Updates

అరెస్టు అనంతరం ఇడి విధించిన రిమాండ్ చట్టవిరుద్ధం కాదని, ఢిల్లీ సిఎంను ఇడి అరెస్టు చేయడం చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదని హైకోర్ట్ మంగళవారం తేల్చి చెప్పింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. హవాలా నిధుల బదిలీకి సంబంధించిన ఆధారాలను ఇడి సమర్పించిందని, గోవాలో ఎన్నికల కోసం నిధులు విరాళంగా ఇచ్చామని అప్రూవర్ చెప్పారని కోర్టు పేర్కొంది. దర్యాప్తు ఎలా సాగుతుందనే విషయంలో ప్రతివాది ఎలాంటి అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదని, ప్రతివాది ఇష్టానుసారం దర్యాప్తు జరగదని హై కోర్టు సూచించింది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 15 వరకు తీహార్ జైలులో ఉన్నారు.

Also Read : Jawahar Reddy : ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!