Arvind Kejriwal : ప్రజలు అరుదైన అవకాశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందించారు. కానీ ఆ అద్భుత అవకాశాన్ని చేజేతులారా నాశనం చేశారని ఆరోపించారు ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ కొలువు తీరి 10 ఏళ్లవుతోంది. చెప్పు కోవడానికి ఏమీ లేదన్నారు. కేవలం దేశాభివృద్దిపై ఫోకస్ పెట్టలేక పోయారు. కానీ పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని వృధా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రధాన మంత్రి పర్యటించని రీతిలో పలు దేశాలను చుట్టి వచ్చారు. చివరకు మిగిలింది ఏమీ లేదన్నారు సీఎం.
Arvind Kejriwal Said
ఇవాళ ఏ రంగమూ స్థిరంగా లేదని మండిపడ్డారు. ప్రతి రంగాన్ని పనిగట్టుకుని మోదీ నాశనం చేశాడని ధ్వజమెత్తారు. దీని వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లి పోయాయని, గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిందని మండిపడ్డారు.
ఎంత సేపు ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేయడం తప్పిస్తే ఇంకే ఏ ఒక్క మంచి పని చేపట్ట లేదంటూ ప్రధానమంత్రి పై విరుచుకు పడ్డారు అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు సీఎం. లేక పోతే ఉన్న కొద్ది పాటి డెమోక్రసీ కూడా దిక్కులేనిదిగా మారుతుందని హెచ్చరించారు.
Also Read : MK Stalin Tribute : నిజమైన ప్రజా నేత ఊమెన్ చాందీ
