Arvind Kejriwal : విద్య‌తోనే గౌర‌వం వికాసం – కేజ్రీవాల్

ఐఐటీల‌తో పోటీ ప‌డుతున్న స్టూడెంట్స్

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శనివారం ఢిల్లీలో సీఎం మాట్లాడారు. ఎవ‌రు ఏ స్థాయిలో ఉన్నా ప్ర‌త్యేకంగా నిలబెట్టేది మాత్రం ఒక్క విద్య మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్. తాను మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని, చ‌దువుకునేందుకు అష్ట క‌ష్టాలు ప‌డ్డాన‌ని చెప్పారు. విద్య విలువ తెలుసుకున్నాను కాబ‌ట్టే తాను విద్యా రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నాన‌ని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాక ముందు దేశ రాజ‌ధాని ఢిల్లీలో వ‌స‌తి సౌక‌ర్యాలు లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కానీ తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే మొద‌టి ప్ర‌యారిటీ విద్య కోసం కేటాయించామ‌ని చెప్పారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ప్ర‌పంచంలో దేనినైనా చోరీ చేయ‌వ‌చ్చ‌ని కానీ చ‌దువును ఎవ‌రూ దొంగిలించ లేర‌ని పేర్కొన్నారు. ఇవాళ ప్ర‌పంచ విద్యా సంస్థ‌ల‌కు ధీటుగా ప్రాథ‌మిక‌, మాధ్య‌మిక విద్యా సంస్థ‌ల‌ను తీర్చి దిద్దామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఢిల్లీ ప్ర‌భుత్వం భారీ ఎత్తున రాష్ట్ర బ‌డ్జెట్ లో కేటాయించిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని పేర్కొన్నారు.

ఇవాళ ప్ర‌భుత్వ బ‌డులు కార్పొరేట్ స్కూళ్ల‌కు మించి న‌డుస్తున్నాయ‌ని తెలిపారు. నూత‌న టెక్నాల‌జీని కూడా అందిపుచ్చుకుని పిల్ల‌లు చ‌దువుకుంటున్నార‌ని, స్టార్ట‌ప్ లు పెట్టేందుకు పోటీ ప‌డుతున్నార‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్.

Also Read : YS Sharmila Rahul : రాహుల్ కు ష‌ర్మిల థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!