Arvind Kejriwal : పనులు చేస్తాం ఓట్లు అడగం
సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు పనులు చేయక ముందే ఓట్లు అడుగుతాయని, కానీ ఆప్ మాత్రం అలాంటి పని చేయదన్నారు. తాము కేవలం పనులు చేస్తాం. ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటేనే తమను ఆశీర్వదించమని కోరుతామన్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal). శనివారం ఛత్తీస్ గఢ్ లో జరిగిన సమావేశంలో ఢిల్లీ సీఎం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Arvind Kejriwal Explains His Vision
76 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో కేవలం ఓట్లు వేయమని అడగని ఏకైక పార్టీ తమ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. తాము చవకబారు ప్రకటనలు చేయమన్నారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వమని స్పష్టం చేశారు. తమ లక్ష్యం ఒక్కటే. ప్రతి ఒక్కరు చదువు కోవాలని, ప్రతి ఒక్కరికీ బతికేందుకు సమాన అవకాశాలు రావాలన్నదేనని పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్.
మేం విద్యా రంగానికి, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు . విద్యతోనే వికాసం అలవడుతుందని, దేశం అభివృద్ది చెందుతుందన్నారు. ఎక్కడైతే బడులు బాగుంటాయో అక్కడే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఆరోగ్య రంగం రెండో ప్రాధాన్యత అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య చికిత్సలు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ రెండూ సమకూరితే ఇక ఉపాధి అన్నది ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : Anasuya Bharadwaj : అయ్యో అనసూయ కంటతడి