Arvind Kejriwal : అదానీ కోసం మోదీ సర్కార్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. పీఎంపై నిప్పులు చెరిగారు. ఈ దేశంలోని యువత ఉపాధిని కోరుకుంటున్నారని అన్నారు.
Arvind Kejriwal Slams PM Modi
ప్రజలు ద్రవ్యోల్బణం నుండి బయట పడాలని కోరుకుంటున్నారని కానీ ప్రధాన మంత్రి వాటి గురించి పట్టించు కోవడం లేదన్నారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). కానీ మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ కేవలం ఈ దేశంలో ఒక్కరి కోసం మాత్రమే పని చేస్తోందని ఆరోపించారు. ఆ ఒక్కరు ఎవరో కాదు దేశంలోని వనరులను అప్పనంగా దోచేస్తున్న ఏకైక దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అని పేర్కొన్నారు.
ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అప్పజెప్పిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు అరవింద్ కేజ్రీవాల్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇది వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో తేలుతుందన్నారు ఢిల్లీ సీఎం. దేశంలో 2 కోట్లకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయని ఇప్పటి వరకు ఒక్క పోస్టు అయనా భర్తీ చేశారా అని ప్రశ్నించారు.
యువత ఆశలను చిదిమేసి , డిజిటల్ మంత్రం పేరుతో ప్రజలను మోసం చేయడం దారుణమన్నారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : Akhilesh Yadav : మోదీకి మూడింది – అఖిలేష్