Arvind Kejriwal : సుప్రీం తీర్పు ప్రశంసనీయం – కేజ్రీవాల్
రాహుల్ గాంధీకి ప్రత్యేక అభినందనలు
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి సంబంధించిన పరువు నష్టం కేసుకు సంబంధించి భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా రాహుల్ కు విధించిన రెండేళ్ల జైలు శిక్ష పై స్టే ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో యావత్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంబురాలలో మునిగి పోయింది. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.
Arvind Kejriwal Words
ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెంప పెట్టుగా అభివర్ణించారు కేజ్రీవాల్. భారత ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలపర్చేలా చేసేందుకు దోహద పడుతుందని స్పష్టం చేశారు.
ఇంత కాలం అలుపెరుగని రీతిలో పోరాటం చేసినందుకు తాతను ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి అభినందనలు తెలియ చేస్తున్నానని తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. రాబోయే రోజుల్లో ఇండియా కూటమిని మరింత పోరాడే శక్తిని ఇచ్చేలా చేస్తుందన్నారు.
Also Read : RS Praveen Kumar : ఇంకెంత కాలం భూముల పందేరం