Arvind Kejriwal : మేక్ ఇండియా నంబర్ 1 ఆప్ లక్ష్యం
మహిళల భద్రత..ఉపాధికి పెద్ద పీట
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత, ఉపాధి, విద్య, వైద్యం కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు.
భారత్ ను ప్రపంచం లోనే నెంబర్ వన్ దేశంగా మార్చడమే తమ ఉద్దేశమన్నారు. అదే మేక ఇండియా నంబర్ 1 మిషన్ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ దేశంలోని ప్రతి పౌరుడు 130 కోట్ల మంది ఈ మిషన్ తో అనుసంధానం కావాలన్నారు. అరవింద్ కేజ్రీవాల్ బుధవారం 2024 సార్వత్రిక ఎన్నికలను నిర్మించడంలో భాగంగా మేక్ ఇండియా నెంబర్ 1 మిషన్ ను ప్రారంభించారు.
భారత దేశాన్ని ప్రపంచంలో టాప్ లో నిలపాలన్నది ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. నెంబర్ వన్ గా మారాలంటే ముందు ప్రధానమైన ఐదు సమస్యలను పరిష్కరించాలన్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal) .
అవి విద్య, వైద్యం, ఉపాధి, మహిళల భద్రత , వ్యవసాయం అని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందజేశామన్నారు.
చదువుకున్న పిల్లలు తమ కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కిస్తారన్నారు. ధనవంతులయ్యేలా చేస్తుంది. దీని వల్ల దేశం కూడా బాగు పడుతుందన్నారు.
అందరికీ నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించడం ముఖ్యమన్నారు. యువతకు ఉపాధి కల్పన ప్రధానమన్నారు సీఎం. మహిళల భద్రత. ఈ దేశంలోని ప్రతి మహిళకు గౌరవం, సమాన హక్కులు ఉండాలన్నారు.
ఐదో రంగం వ్యవసాయం. ప్రతి రైతు పండించిన పంటకు గిట్టు బాటు ధర కల్పించడం. రైతుల పిల్లలు కూడా తాము కూడా సాగు చేస్తామని గర్వంగా చెప్పాలన్నారు.
Also Read : గూగుల్ వార్నింగ్ ఆపిల్ బిగ్ షాక్