Arvind Kejriwal : యూపీ పోలీసుల తీరుపై కేజ్రీవాల్ సెటైర్
జీ టీవీ యాంకర్ అరెస్ట్ వ్యవహారంపై కామెంట్
Arvind Kejriwal : రాహుల్ గాంధీని కించ పరిచేలా ప్రసారం చేశారనే ఆరోపణలపై జీ టీవికి చెందిన యాంకర్ రోహిత్ రంజన్ పై రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో కేసులు నమోదయ్యాయి.
ఈ తరుణంలో ఢిల్లీకి వెలుపల నివసిస్తున్న రోహిత్ రంజన్ ను అరెస్ట్ చేసేందుకు ఛత్తీస్ గఢ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన సదరు జర్నలిస్ట్ వెంటనే యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారెంట్ చూపించకుండా ఎలా అరస్ట్ చేస్తారంటూ ప్రశ్నించాడు. దీంతో ఓ వైపు ఛత్తీస్ గఢ్ పోలీసులు ఇంకో వైపు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఘజియాబాద్ పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మొత్తం వ్యవహారంలో ఘజియాబాద్ పోలీసులు పైచేయి సాధించారు. విచిత్రం ఏమిటంటే కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం యూపీలో కొలువు తీరింది.
ఇక ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది. ఈ జర్నలిస్ట్ అరెస్ట్ వ్యవహారం రచ్చకు దారి తీసీంది. ఇప్పటికే జీ టీవీ యాజమాన్యం (ఎస్సెల్ గ్రూప్ ) బహిరంగంగానే క్షమాపణలు చెప్పింది.
కానీ కేసులు వెనక్కి తగ్గలేదు. ఈ మొత్తం వ్యవహారంపై నిప్పులు చెరిగారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . మంగళవారం ఢిల్లీ అసెంబ్లీ వేదికగా ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
చైనా దేశంలోకి ప్రవేశిస్తుంటే స్పందించని పోలీసులు ఇరు రాష్ట్రాల మధ్య ఒక జర్నలిస్ట్ కోసం కొట్టుకు చస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
Also Read : జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ అరెస్ట్