Arvind Kejriwal : ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి – కేజ్రీవాల్
మధ్య ప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోరు పెంచారు. ఆయన నిన్న ఛత్తీస్ గఢ్ కు వెళ్లారు. అక్కడ తాము పనులు చేసి పెడతామని హామీలు ఇవ్వబోమంటూ ప్రకటించారు. తాజాగా మధ్య ప్రదేశ్ లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అరవింద్ కేజ్రీవాల్.
Arvind Kejriwal Speech about His Vision
ఈ దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ, సంకీర్ణ ప్రభుత్వాలు 76 ఏళ్లుగా పరిపాలించాయి. కానీ దేశం ఇవాళ ఎందుకు అలా ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా అని ప్రశ్నించారు. తాము డబ్బులు సంపాదించేందుకు ఇక్కడికి రాలేదన్నారు. నేను(Arvind Kejriwal) ఇన్ కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉన్నానని, కానీ భారీ జీతాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కేవలం ప్రజల కోసం సేవ చేసేందుకు తాను తన జాబ్ ను వదులు కున్నానని పేర్కొన్నారు.
ఇన్నేళ్లుగా ఇక్కడ కాంగ్రెస్ పరిపాలించింది. బీజేపీ కొలువు తీరింది. కానీ ఏమైనా మీ కష్టాలు తీరాయా అని నిలదీశారు సీఎం. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఢిల్లీ, పంజాబ్ పాలనను ఇక్కడ మీరు అనుభవిస్తారని అన్నారు. మధ్యప్రదేశ్ లో కాంట్రాక్టు కింద పని చేస్తున్న వారినందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే పంజాబ్ లో 12,000 మంది టీచర్లను రెగ్యులర్ చేశారని చెప్పారు. అమర జవాన్లకు కోటి రూపాయలు ఇస్తామన్నారు.
Also Read : CM KCR : ధరణికి మీరే రాజులు – కేసీఆర్