Arvind Kejriwal : పీఎం స‌హ‌కారం అవ‌స‌రం – కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం షాకింగ కామెంట్స్

Arvind Kejriwal : ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో బుధ‌వారం ఫ‌లితాలు వెల్ల‌వ‌డ్డాయి. 250 సీట్ల‌కు గాను 134 సీట్ల‌లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. 104 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది బీజేపీ. గ‌త 15 ఏళ్లుగా మ‌హాన‌గ‌రాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకుంది కాషాయం. కానీ అనూహ్యంగా చెక్ పెట్టింది అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్.

ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal). కేంద్రం స‌హ‌కారం, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆశీర్వాదం కావాల‌ని అన్నారు. ఢిల్లీని శుభ్రం చేసేందుకు ఇత‌ర పార్టీల‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని ఆప్ కోరుకుంటోంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో భారీ గెలుపును క‌ట్టబెట్టినందుకు ఓట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు సీఎం. ప్ర‌తి ఒక్క‌రినీ ఈ సంద‌ర్భంగా పేరు పేరునా అభినందిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ అపూర్వ విజ‌యం ఆప్ ప్ర‌భుత్వ ప‌నితీరుకు నిద‌ర్శ‌నం అన్నారు. అంతే కాదు క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి ఒక ఆప్ కార్య‌క‌ర్త‌తో పాటు ఓటు వేసిన వారికి ఓటు వేయ‌ని వారికి కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు అర‌వింద్ కేజ్రీవాల్.

భార‌తీయ జ‌న‌తా పార్టీ కేంద్రంతో పాటు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ , పౌర సంఘాన్ని ఉప‌యోగించి ప్ర‌తి మ‌లుపులోనూ అడ్డుకుంటోంద‌ని ఆప్ ఇప్ప‌టి కే ఆరోపించింది. దీంతో ప్ర‌జ‌లు త‌మ‌కు పూర్తి అధికారాన్ని, ప‌వ‌ర్స‌న్ ను ఈ ర‌కంగా క‌ట్ట‌బెట్టార‌ని అన్నారు ఆప్ చీఫ్‌, సీఎం. ప్ర‌జ‌లు నిర్మాణాత్మ‌క రాజ‌కీయాల‌ను కోరుకుంటున్నార‌ని కానీ విద్వేషాన్ని కాద‌న్నారు.

Also Read : అతి పెద్ద పార్టీపై చిన్నపాటి విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!