Arvind Kejriwal : అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్

జాక్ డోర్సీ కామెంట్స్ పై స్పంద‌న

Arvind Kejriwal : ట్విట్ట‌ర్ మాజీ సీఇవో జాక్ డోర్సీ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీశాయి. సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్ కొన‌సాగుతోంది. మోదీ ప్ర‌భుత్వం త‌మ‌పై తీవ్ర ఒత్తిళ్ల‌కు పాల్ప‌డిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇది ఏ ర‌క‌మైన ప్ర‌జాస్వామ్య‌మో చెప్పాల‌ని నిల‌దీశారు. ఇదిలా ఉండ‌గా కేంద్ర క్రీడా శాఖ మంత్రి సీరియ‌స్ గా స్పందించారు డోర్సీ చేసిన వ్యాఖ్య‌లు అస‌త్య‌మ‌ని పేర్కొన్నారు. ఇది మోదీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు విదేశీ శ‌క్తులు ఆడుతున్న నాట‌కంగా కొట్టి పారేశారు.

మ‌రో వైపు ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మంగ‌ళ‌వారం జాతీయ మీడియాతో మాట్లాడారు. జాక్ డోర్సీ అన్న‌దాంట్లో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. గ‌త కొంత కాలంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం కావాల‌ని త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ ఆరోపించారు. ఇది కూడా ప్ర‌జాస్వామ్యాన్ని తొక్కి పెట్ట‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు.

ఈ దేశంలో అన్నం పెడుతున్న రైతుల‌కు పోరాటం చేసే హ‌క్కు త‌ప్ప‌క ఉంటుంద‌న్నారు. దీనిని అడ్డుకోవ‌డం ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ట్విట్ట‌ర్ మాజీ సీఇవో జాక్ డోర్సీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. భార‌త దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేద‌ని ఆరోపించారు. ఆపై తీవ్ర వేధింపుల‌కు పాల్ప‌డ్డారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : Anurag Thakur : జాక్ డోర్సీ కామెంట్స్ ఠాకూర్ సీరియ‌స్

 

Leave A Reply

Your Email Id will not be published!