Arvind Kejriwal : అస్సాం సీఎంపై కేజ్రీవాల్ కన్నెర్ర
ఎప్పుడు రావాలో చెప్పమంటూ సవాల్
Arvind Kejriwal : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
దీనిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదంటూ బిస్వా శర్మ పేర్కొన్నారు. దీంతో ఇద్దరి మధ్య ట్విట్టర్ లో వార్ నడుస్తోంది.
తాజాగా అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal). దమ్ముంటే డేట్ చెప్పండి. మేమొస్తాం రాష్ట్రంలో మీ స్కూళ్లను చూస్తామని చెప్పారు.
తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని సవాల్ విసిరారు. డేట్ మీరు డిసైడ్ చేస్తే వచ్చేందుకు రెడీగా ఉన్నామన్నారు. పాఠశాలల మూసివేత పరిష్కారం కాదని, దేశ వ్యాప్తంగా బడులు మరిన్ని తెరవాల్సిన అవసరం ఉందన్నారు కేజ్రీవాల్.
అంతే కాకుండా ఓ పత్రికలో అస్సాంలో పాఠశాలల మూసివేత అనే శీర్షికతో వచ్చిన వార్తను షేర్ చేశారు ఢిల్లీ సీఎం. మీరు ఢిల్లీకి వస్తారా లేక మమ్మల్ని మీ బడులను చూసేందుకు రమ్మంటారా అని నిలదీశారు.
తాము కొలువు తీరాక దేశానికే రోల్ మోడల్ గా చేశామన్నారు. నేను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నాను. నా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి.
మీరు నిరభ్యంతరంగా ఢిల్లీకి రావచ్చు. మా బడులను , వసతులను, మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాల బోధనను చూడవచ్చని స్పష్టం చేశారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అస్సాం సీఎం కేజ్రీవాల్. 44,521 బడులు, 65 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు.
Also Read : జార్ఖండ్ సంక్షోభం ఎమ్మెల్యేల తరలింపు