Arvind Kejriwal : గుజరాత్ లో రాజకీయం వేడెక్కింది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది. ఎన్నికల హీట్ పెరిగింది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కి ప్రజలు పట్టం కట్టడంతో త్వరలో జరగబోయే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై ఆప్ కన్నేసింది.
ఈ మేరకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆదివారం గుజరాత్ లో పర్యటించిన కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రసంగించారు. రాష్ట్రంలోని పాఠశాలలో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు.
అన్ని పరీక్షలు లీకులు లేకుండా కొనసాగడం లేదని ఆరోపించారు. మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి మేమేంటో నిరూపిస్తామన్నారు. ఒక్క పరీక్షైనా లీకు లేకుండా నిర్వహించగలరా సీఎం అంటూ భూపేష్ భఘేల్ కు సవాల్ విసిరారు అరవింద్ కేజ్రీవాల్.
గాడి తప్పిన పాఠశాలలను మెరుగు పర్చక పోతే నన్ను తరిమి కొట్టండి అంటూ పిలుపునిచ్చారు. తాము ఏది చెబుతామో అదే చేస్తామన్నారు. ప్రధానంగా పరీక్షల సమయంలో పేపర్ల లీకేజీల విషయంలో గుజరాత్ ప్రపంచ రికార్డు సృష్టిస్తోందంటూ ధ్వజమెత్తారు.
విద్యా రంగం కునారిల్లి పోయిందన్నారు. ఎక్కడా అభివృద్ధి ఎజెండా కనిపించడం లేదన్నారు సీఎం. గుజరాత్ లో 6 వేల పాఠశాలలు మూత పడ్డాయి. మరికొన్ని శిథిలావస్థల్లో ఉన్నాయి.
లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. ఢిల్లీలో లాగే ఇక్కడ కూడా బడుల్ని మారుస్తామన్నారు. మెరుగైన విద్యను అందిస్తామని చెప్పారు.
ఢిల్లీలో 4 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వం నడిపిస్తున్న బడులకు మారారని చెప్పారు కేజ్రీవాల్. పేదలు, ధనవంతుల పిల్లలు కలిసి చదువు కుంటున్నారని తెలిపారు. సారి 99.7 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
Also Read : సీనియర్ నేత పీసీ జార్జ్ అరెస్ట్