Arvind kejriwal LG : ఢిల్లీలో లా అండ్ ఆర్డ‌ర్ విఫ‌లం – సీఎం

ఎల్జీ స‌క్సేనాపై భ‌గ్గుమ‌న్న కేజ్రీవాల్

Arvind kejriwal LG : ఢిల్లీలో ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. లా అండ్ ఆర్డ‌ర్ పై కేంద్రం వ‌ర్సెస్ సీఎం కేజ్రీవాల్ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. తాజాగా కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి పంజాబ్ లోని చండీగ‌ఢ్ లో జ‌రిగిన స‌భ‌లో ఆప్ స‌ర్కార్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై ఆప్ నిప్పులు చెరిగింది రాజ్ నాథ్ సింగ్ పై. మ‌ణిపూర్ లో మంట‌లు ఆర‌డం లేద‌ని, ఇప్ప‌టికే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని, 300 మంది గాయ‌ప‌డ్డార‌ని , 60 వేల మంది నిరాశ్ర‌యుల‌య్యార‌ని కానీ అక్క‌డ కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఇప్ప‌టి దాకా కంట్రోల్ చేయ‌లేక పోతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)

ఇదే స‌మ‌యంలో ఢిల్లీలో ఆప్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టికీ లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉంటుంది. దీని ప‌ర్య‌వేక్ష‌ణ అంతా ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతుంది. ఇటీవ‌ల దారి దోపిడీలు, హ‌త్య‌లు, మాన భంగాలు, సామూహిక అత్యాచారాలు, వ్య‌క్తిగ‌త దాడులు మ‌రింత పెరిగాయి. దీనికి పూర్తిగా బాధ్య‌త వ‌హించాల్సింది ఎల్జీ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

ఢిల్లీలో జంగిల్ రాజ్ కొన‌సాగుతోంద‌ని, వెంట‌నే కేంద్రం త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని , త‌క్ష‌ణ‌మే ఢిల్లీ పోలీసుల‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు ముఖ్య‌మంత్రి .

Also Read : Bhatti Vikramarka : దోపిడీకి చిరునామా దొర పాల‌న

 

Leave A Reply

Your Email Id will not be published!