Arvind Kejriwal Saxena : ఢిల్లీ ఎల్జీపై కేజ్రీవాల్ కన్నెర్ర
బీజేపీ కార్యకర్త లాగా వ్యవహారం
Arvind Kejriwal Saxena : ఢిల్లీలో రాజకీయ దుమారం తీవ్రమవుతోంది. ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ బల్దియా ఎన్నికల్లో ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బ తగిలింది.
మొత్తం 250 సీట్లకు గాను 104 సీట్లకే పరిమితమైంది. మరో వైపు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. దాంతో 15 ఏళ్ల పాటు కొనసాగుతూ వచ్చిన బీజేపీ తన పవర్ ను కోల్పోయింది. ఇక మేయర్ , డిప్యూటీ మేయర్, నామినేటెడ్ పోస్టుల విషయంలో గందరగోళం చోటు చేసుకోవడంతో ప్రొటెం స్పీకర్ వాయిదా వేశారు.
ఈ తరుణంలో ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరిగింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సభను ఉద్దేశించి మాట్లాడారు. తన వల్లే బీజేపీకి ఎంసీడీ ఎన్నికల్లో అన్ని సీట్లు వచ్చాయని ఎల్జీ తనతో చెప్పారని బాంబు పేల్చారు. బీజేపీ కులం, మతం పేరుతో రాజకీయం చేస్తోందని కానీ తాము మాత్రం విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టామని చెప్పారు.
విద్యా రంగంపై భారీగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్ కు రాజకీయం చేయడం తప్ప పని చేయడం రాదన్నారు. పదే పదే అడ్డు చెప్పడం, సంతకాలు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదన్నారు.
ప్రపంచంలో అత్యంత నాణ్యమైన విద్యా వ్యవస్థ ఫిన్ లాండ్ లో ఉందన్నారు. అందుకే బడుల్లో పని చేస్తున్న టీచర్లకు అక్కడ శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.
Also Read : భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథం