Arvind Kejriwal : దేశానికి ఏది ముఖ్యం – కేజ్రీవాల్
వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కామెంట్
Arvind Kejriwal : న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం సీఎం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకు రావాలని నిర్ణయించింది. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Arvind Kejriwal Slams BJP Govt
ఇంతకూ మోదీకి, ఆయన పరివారానికి ఈ దేశానికి ఏం కావాలనే దానిపై క్లారిటీ లేదని మండిపడ్డారు. ఆనాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసింది బడా బాబులకు, వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు దేశానికి చెందిన వనరులను దోచి పెట్టమని కాదన్నారు.
ఇవాళ తమ తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు, తమ వైఫల్యాలను ప్రజలు గుర్తించకుండా ఉండేందుకు రోజుకో నినాదంతో బీజేపీ ముందుకు వస్తోందని ఆరోపించారు. దేశానికి కావాల్సింది అందరికీ విద్య, మెరుగైన ఆరోగ్యం, బతికేందుకు ఉపాధి అని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
ఒకే దేశం ఒకే విద్య ను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల ధనికుడైనా లేదా పేద వాడైనా అందరికీ సమానంగా విద్యను అందించాలని పిలుపునిచ్చారు. వన్ నేషన్ వన్ ట్రీట్మెంట్ అంటే అర్థం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఆరోగ్య వసతి అందుబాటులో ఉండేందుకు కృషి చేయాలని కోరారు.
Also Read : Anurag Thakur : సనాతన ధర్మం శాశ్వతం – ఠాకూర్