Arvind Kejriwal PM Modi : దళితులంటే మోదీకి చులకన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal PM Modi : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీపై నిప్పులు చెరిగారు. ఆయనకు దళితులంటే చులకన భావం ఉందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు శ్రీరాముడి ఆలయ శంకుస్థాపనకు అప్పటి దళితుడైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను నరేంద్ర మోదీ ఆహ్వానించ లేదని మండిపడ్డారు అరవింద్ కేజ్రీవాల్.
తాజాగా కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసేందుకు పీఎం మోదీ భారత ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆప్ తో పాటు మొత్తం 20 ప్రతిపక్షపార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. తాము హాజరు కాబోమంటూ స్పష్టం చేశాయి. ఆర్టికల్ 87 ప్రకారం భారత రాజ్యాంగం ఇప్పటికీ రాష్ట్రపతి మాత్రమే ప్రారంభించాలని ఉందని స్పష్టం చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
మే 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పార్లమెంట్ ను ప్రారంభిస్తారని ఇప్పటికే పార్లమెంట్ సచివాలయం వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ముర్ముతో ప్రారంభించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ జయా కిషన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : Ravi Shankar Prasad