Asaduddin Owaisi : ఓటేసేందుకు ముందుకు రావాలి
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi : హైదరాబాద్ – ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ నగర ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi). దయచేసి గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు ఓటు వేయాలని కోరారు. ఎవరైతే ప్రగతిని కోరుకుంటారో దానిని సమర్థవంతంగా నిర్వహించి ప్రజల కోసం పని చేసే వాళ్లను గెలిపించు కోవాలని సూచించారు.
Asaduddin Owaisi Comment
తాను ఓటు వేయక పోతే ఏమవుతుందని అనుకోవద్దని అన్నారు. ఓటు ఆయుధమని , అది తమ అభివృద్దిని , రాష్ట్ర, కేంద్ర భవిష్యత్తును నిర్దేశిస్తుందన్న విషయం తెలుసు కోవాలన్నారు. తమ పార్టీ తరపున మొత్తం 9 మంది బరిలో ఉన్నారని, ఆ మొత్తం గెలవడం ఖాయమన్నారు అసద్దుదీన్ ఓవైసీ.
ఐటీ, ఫార్మా, ఇతర రంగాలలో పని చేస్తున్న వారంతా తరలి రావాలని ఓటు వేసేందుకన్నారు. ఇదిలా ఉండగా యాకుత్ పూర, తదితర ప్రాంతాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎంబీటీ, ఎంఐఎం అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరో వైపు బీఆర్ఎస్ సర్కార్ కు బహిరంగంగా ఎంఐఎం మద్దతు ఇస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీరియస్ కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ , బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని పేర్కొంది.
Also Read : Vikas Raj CEO : ఇంకా పోలింగ్ శాతం పెరగాలి – సిఇవో