Asaduddin Owais : హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది. దీనిపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owais) స్పందించారు.
ఈ దారుణ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు ఎంపీ. ఇది రాజ్యాంగం ప్రకారం నేర పూరిత చరయ. ఇస్లాం ప్రకారం అయితే చెత్ నేరమని ఓవైసీ అన్నారు.
ఈ స్థాయిలో ఎవరు ఉన్నా ఖండిస్తారని పేర్కొన్నారు. మహిళ ఇష్టంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్తను చంపే హక్కు ఆమె సోదరుడుడిక లేదని మరోసారి స్పష్టం చేశారు.
విచిత్రం ఏమిటంటే నిన్నటి ఈ ఘటనకు మరో రంగు పులుమాలని ప్రయత్నం జరుగుతోంది. దీనిని మేం నిరసిస్తున్నాం. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏ స్థాయిలో ఉన్నా లేదా ఏ పార్టీకి చెందిన వారైనా సరే. ఒక రకంగా ఇది బాధాకరం.
ఇలా జరిగి ఉండాల్సింది కాదన్నారు ఓవైసీ. ఆయన దేశంలో జరుగుతున్న ఘటనల గురించి కూడా స్పందించారు.
ఢిల్లీలోని జహంగీర్ పూర్ , మధ్య ప్రదేశ్ లోని ఖర్గోన్ లలో జరిగిన మత పరమైన హింసాత్మక సంఘటనలకు సంబంధించి ఆధారాలు లభించాలంటే ప్రతి చోటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఇలా చేసి సామాజిక మాధ్యమాలలో లైవ్ పెడితే ఎవరు నిందితులో తేలుతుందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. రాళ్లు వేసేది ఎవరో, వేస్తున్నది ఎవరో, రాజకీయం చేస్తున్నది ఎవరో తేలుతుందన్నారు అసదుద్దీన్ ఓవైసీ.
ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : గీత దాటారు కానీ దేశ ద్రోహం కాదు