Asaduddin Owaisi : రాహుల్ పై ఓవైసీ సెటైర్
ఐంఎంఐ చీఫ్ కామెంట్స్
Asaduddin Owaisi : హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తిరిగి ముచ్చటగా మూడోసారి సీఎం గా కేసీఆర్ కొలువు తీరడం ఖాయమని జోష్యం చెప్పారు. ఎంపీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ టూర్ కు వస్తే అభివృద్ది ఏమిటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ గురించి.
Asaduddin Owaisi Comments on Rahul Gandhi
రాష్ట్రం అభివృద్దిని చూసేందుకు రెండు కళ్లు చాలవన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రశంసలతో ముంచెత్తారు అసదుద్దీన్ ఓవైసీ. 40 ఏళ్లు అధికారంలో ఉండి అమేథిని ఏం అభివృద్ది చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా 9 ఏళ్లలో తెలంగాణ అమేథీ కంటే ఎక్కువగా అభివృద్ది చెందిందన్నారు ఎంపీ. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో రానున్నారని, ఆయన ఎక్కడికి వెళ్లినా నీళ్లతో నిండిన చెరువులు, కళ కళలాడే ప్రాజెక్టులు కనిపిస్తాయని ఇంతకంటే ఇక తెలంగాణకు ఏం కావాలంటూ ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi). ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు కాళేశ్వరం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు ఎంపీ.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసే ఎంఐఎం పార్టీ చీఫ్ కు రాహుల్ గాంధీని విమర్భించే నైతిక హక్కు లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. నీ స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు.
Also Read : KA Paul : కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్