Asaduddin Owaisi : రాహుల్ పై ఫైర్ అజ్జూకు షాక్
ఎంఐఎం చీఫ్ ఓవైసీ కామెంట్స్
Asaduddin Owaisi : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మారబోతోందా. ఏమో కానీ హైదరాబాద్ లో పట్టు కలిగిన ఎంఐఎం బహిరంగంగానే కొలువుతీరిన బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తోంది. ఈ తరుణంలో గతంలో 7 చోట్ల పోటీకి దిగిన ఆ పార్టీ ఈసారి మరో రెండు సీట్లలో అదనంగా పోటీ చేయబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.
Asaduddin Owaisi Slams Rahul Gandhi
ఈసారి పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని గమనించారు. దేశంలో రోజు రోజుకు మైనార్టీ వర్గాలపై పనిగట్టుకుని దాడులు జరుగుతుండడం కొంచెం ప్రభావం చూపే అవకాశం లేక పోలేదు. దీంతో ఈసారి అభ్యర్థులను కూడా ఆచి తూచి ఎంపిక చేశారు ఓవైసీ.
ఇదిలా ఉండగా ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవి సాధించాలని కలలు కంటున్నారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజాహరుద్దీన్(Asaduddin Owaisi ). ఆయనకు పార్టీ జూబ్లీ హిల్స్ టికెట్ కేటాయించింది. అక్కడ ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక్కడ బరిలో నిలవాలని అనుకున్న మాజీ ఎమ్మెల్యే విష్ణు గులాబీ గూటికి చేరారు.
ఈ సందర్బంగా ఓవైసీ నిప్పులు చెరిగారు. పార్టీ పరంగా ఏడుగురిని ప్రకటించిన ఆయన రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. బరా బర్ జూబ్లీ హిల్స్ నుంచి బరిలోకి దిగుతామని ప్రకటించారు. గతంలో అజ్జూ తనయుడు చని పోయినప్పుడు ఓవైసీ దగ్గరుండి చూసుకున్నారు. ఆనీ సీన్ మారడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also Read : Bhatti Vikramarka : కేసీఆర్ మోసం తెలంగాణకు ద్రోహం