Ashish Deshmukh : మరాఠా కాంగ్రెస్ పై ఆశిష్ ఆగ్రహం
నాయకత్వం తప్పు చేతుల్లో ఉంది
Ashish Deshmukh : మరాఠా కాంగ్రెస్ నాయకత్వం తప్పు చేతుల్లో ఉందని సంచలన కామెంట్స్ చేశారు బహిష్కరణకు గురైన మాజీ ఎమ్మెల్యే ఆశిష్ దేశ్ ముఖ్(Ashish Deshmukh). తనను పార్టీ నుంచి బహిష్కరించడం సరైన పద్దతి కాదన్నారు. గురువారం ఆశిష్ దేశ్ ముఖ్ మీడియాతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం సరైన వ్యక్తుల చేతుల్లో లేదని ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా చేసిన కామెంట్స్ పై రాష్ట్ర కాంగ్రెస్ ఇటీవల ఆశిష్ దేశ్ ముఖ్ ను పార్టీ నుండి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించింది. దేశ్ ముఖ్ ను బహిష్కరిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చీఫ్ , మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ మే 22న లేఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పాలని చేసిన ప్రకటనపై దేశ్ ముఖ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఏప్రిల్ 9న ఆశిష్ దేశ్ ముఖ్ ఏప్రిల్ 9న వివరణ ఇచ్చారు. దీనిపై కమిటీ చర్చించిందని లేఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశ్ ముఖ్ నాగ్ పూర్ లోని కటోల్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read : Satyendra Jain