Ashiwini Vaishnaw : సోష‌ల్ మీడియాపై కేంద్రం న‌జ‌ర్

కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్

Ashiwini Vaishnaw : కేంద్రంలో కొలువుతీరిన మోదీ స‌ర్కార్ మ‌రోసారి సామాజిక మాధ్య‌మాలపై క‌న్నేసింది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయ పార్టీల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ సోష‌ల్ మీడియాను వాడుకున్నంత ఏ పార్టీ వాడుకోవ‌డం లేదు.

ఇప్ప‌టి ఆ పార్టీకి వాట్సాప్ యూనివ‌ర్శిటీగా పేరుంది. ఈ త‌రుణంలో హ‌ద్దు మీరుతున్న సామాజిక మాధ్య‌మాల‌కు ముకుతాడు వేసే ప్ర‌య‌త్నం చేస్తోంది కేంద్ర స‌ర్కార్. ఇదే విష‌యాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్(Ashiwini Vaishnaw) స్ప‌ష్టం చేశారు.

ఈ మేర‌కు రూల్స్ , రెగ్యులేష‌న్స్ లో మార్పులు తీసుకు రావావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయప‌డ్డారు. వాట్ ఇండియా థింక్స్ టుడే అన్న అంశంపై ఆయ‌న మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, సామాజిక మాధ్య‌మాలు స్వీయ నియంత్ర‌ణ క‌లిగి ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

లేక‌పోతే విచ్చ‌ల‌విడిత‌నం పేట్రేగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు అశ్వినీ వైష్ణ‌వ్. ప్ర‌త్యేకించి మీడియా గ్రూపులు త‌మ ప‌రిమితులు ఏమిటో ప్ర‌ధానంగా గుర్తించాల‌న్నారు.

ఇక సోష‌ల్ మీడియా హ‌ద్దులు దాటి పోతోంద‌ని, దానికి ముకుతాడు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు ఐటీ మంత్రి. జ‌వాబుదారీత‌నం లేకుండా పోతే ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయ‌ని హెచ్చ‌రించారు.

ఇది మంచిది కాద‌ని సూచించారు వైష్ణ‌వ్(Ashiwini Vaishnaw). క‌ట్టుదిట్టం చేయాల‌ని ఏ స‌ర్కార్ కోరుకోద‌ని, కానీ హ‌ద్దులు దాటితే మాత్రం చూస్తూ ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు.

యూట్యూబ్, ట్విట్ట‌ర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ , వాట్సాప్ ల‌క్ష్మ‌ణ రేఖ దాటుతున్నాయ‌ని అందుకే ఫోక‌స్ పెట్టామ‌న్నారు.

Also Read : లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల నిర్వాకం గ‌వ‌ర్న‌ర్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!