Ashok Gajapathi Raju : త్వరలోనే బాబు బయటకు వస్తారు
భువనేశ్వరికి అశోక గజపతి రాజు భరోసా
Ashok Gajapathi Raju : రాజమండ్రి – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అశోక గజపతి రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా వారి మధ్య చర్చలు జరిగాయి.
Ashok Gajapathi Raju Comment Viral
ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు నాయుడు తప్పకుండా , క్షేమంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు భువనేశ్వరికి ధైర్యంగా ఉండాలని సూచించారు. చివరకు న్యాయం, ధర్మం గెలుస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి అశోక గజపతి రాజు(Ashok Gajapathi Raju). సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ఎందుకు ఆధారాలు సమర్పించ లేక పోయిందో చెప్పాలని పేర్కొన్నారు.
ఏదో ఒక రోజు నారా చంద్రబాబు సగర్వంగా , విజయ గర్వంతో బయటకు వస్తారని ఆ నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు అశోక గజపతి రాజు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఆయనకు ఓ లెక్క కాదన్నారు.
Also Read : YSRCP Slams : రామోజీ విషపు రాతలు మానుకో