Ashok Gehlot : రొటీన్ వర్క్ లో అశోక్ గెహ్లాట్ బిజీ
సీఎం మార్పుపై తొలగని ఉత్కంఠ
Ashok Gehlot : రాజస్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభానికి తాత్కాలికంగా తెర పడినట్లు అనిపిస్తున్నా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. మొదట కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి సంబంధించి అక్టోబర్ 17న జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ఝలక్ ఇచ్చారు.
అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) తో పాటు మధ్య ప్రదేశ్ మాజీ సీఎంలు కమల్ నాథ్ , దిగ్విజయ్ సింగ్ పేర్లు చివరి వరకు వినిపించాయి. కానీ చివరకు మేడం రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గేను ఖరారు చేసింది. మరో వైపు జి23 అసమ్మతి టీంలో కీలకమైన నాయకుడిగా ఉంటూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బరిలో ఉన్నారు.
ప్రస్తుతం ఇద్దరి నేతల మధ్య యుద్దం కొనసాగుతోంది. ఇద్దరూ తమ తమ ప్రచారంలో మునిగి పోయారు. గాంధీ ఫ్యామిలీ నుంచి పుష్కలంగా ఖర్గేకు మద్దతు ఉంది. అయితే పార్టీలో అసంతప్తి అన్నది లేదని ప్రజాస్వామ్య పద్దతిలోనే ఎన్నిక జరగనుందని ఖర్గే చెబుతున్నారు. కాగా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటే బావుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని తన ప్రత్యర్థి శశి థరూర్ కు కూడా స్పష్టం చేశానని తెలిపారు ఖర్గే. దీంతో రాజస్థాన్ లో సీఎం మార్పు ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతున్నా డోంట్ కేర్ అంటూ సీఎం గెహ్లాట్(Ashok Gehlot) తన రోటిన్ వర్క్ లో బిజీగా మారారు.
రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయన ఎప్పటి లాగే బీజీగా మారారు. సోనియా ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. బళ్లారిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు.
Also Read : తల్లి షూలేస్ సవరించిన రాహుల్ గాంధీ