Ashok Gehlot Modi : నాటి జాతిపిత వల్లే నేటి మోదీకి గుర్తింపు
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ షాకింగ్ కామెంట్స్
Ashok Gehlot Modi : ప్రపంచ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీకి పేరుంది. ఎందుకంటే ఆయన హింసను కాదన్నారు. అహింసను , శాంతిని కోరుకున్నారు. ఉన్నాదుల ఆగ్రహానికి బలై పోయారు. నాటి జాతిపిత గాంధీ, నెహ్రూ వల్లనే నేడు ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి(PM Modi) గౌరవం లభిస్తోందన్నారు.
ఆయన చేసిన పనులేవీ దేశానికి ఆమోద యోగ్యంగా లేవన్నారు. విచిత్రం ఏమిటంటే బీజేపీనే వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా సమయంలో ఎందుకు మహమ్మారి కారణంగా చని పోయిన వారి సంఖ్యను దాచి పెట్టారంటూ ప్రశ్నించారు అశోక్ గెహ్లాట్.
గత చరిత్రను చెరపాలని చూస్తే వచ్చే పాలకులు కూడా నీ చరిత్రను భూ స్థాపితం చేస్తారంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా గత కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం ప్రారంభించిన రత్లాం – దుంగార్ పూర్ , బన్స్వారా మధ్య రైల్వే ప్రాజెక్టును సమీక్షించాలని రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇంకా ఈ దేశంలో డెమోక్రసీ బతికే ఉందన్నారు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ పాలించడం వల్లేనని కానీ బీజేపీ వల్ల కాదని గుర్తు పెట్టుకోవాలని సూచించారు పీఎంకు. మంగళవారం సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) మీడియాతో మాట్లాడారు. మోదీ విదేశాలకు వెళ్లిన ప్రతి సమయంలోనూ ఆదరణ లభించేందుకు కారణం మహాత్మా గాంధీ అని మరోసారి స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం గిరిజనుల కోసం కాలేజీలు, యూనివర్శిటీలు ప్రారంభించడం నుంచి వైద్య సదుపాయాలు కల్పించడం జరిగిందని చెప్పారు.
Also Read : భారీ అవినీతి వల్లే కూలిన వంతెన