Ashok Tanwar : ఆప్ లో చేరిన అశోక్ త‌న్వ‌ర్

టీఎంసీ నుంచి ఆప్ లోకి జంప్

Ashok Tanwar : హ‌ర్యానా టీఎంసీ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్న అశోక్ త‌న్వ‌ర్ (Ashok Tanwar)ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సోమ‌వారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స‌మ‌క్షంలో ఆప్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇదిలా ఉండ‌గా 2021 న‌వంబ‌ర్ లో టీఎంసీలో చేరారు. పంజాబ్ లో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేప‌థ్యంలో అశోక్ త‌న్వ‌ర్ ఈ చ‌ర్య‌కు దిగారు.

ఆయ‌న యాధృశ్చికంగా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయ‌న స్వంతంగా అప్నా భార‌త్ మోర్చా ని ప్రారంభించారు. గ‌తంలో అశోక్ త‌న్వ‌ర్ (Ashok Tanwar)కాంగ్రెస్ పార్టీలో ఉన్న స‌మ‌యంలో ఆ పార్టీ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీకి ద‌గ్గ‌ర‌గా ఉండే వారు.

ఇండియ‌న్ నేష‌న‌ల్ యూత్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి గా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా హ‌ర్యానా మాజీ సీఎం భూపింద‌ర్ సింగ్ హూడాతో సుదీర్ఘ టర్బ్ వార్ త‌ర్వాత త‌న్వ‌ర్ 2019 అక్టోబ‌ర్ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీని వీడారు.

కాంగ్రెస్ పార్టీ త‌న ప్రాథ‌మిక సిద్దాంతాల‌కు దూర‌మైంద‌ని ఆరోపించారు. ఆనాటి ఎన్నిక‌ల్లో త‌న్వ‌ర్ త‌న మ‌ద్ద‌తును దుష్యంత్ చౌతాలా జ‌న నాయ‌క్ జ‌న‌తా పార్టీ కి విస్త‌రించాడు. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశాడు.

2021 ఫిబ్ర‌వ‌రి లో అప్నా భార‌త్ మోర్చా అనే స‌రికొత్త రాజ‌కీయ పార్టీని ప్రారంభించారు. త‌న్వ‌ర్ హ‌ర్యానా కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా , అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ కార్య‌ద‌ర్శి వంటి కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టింది.

Also Read : తేజ‌స్వి సూర్య సంచ‌ల‌న కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!