ASK Modi Protest : అమెరికాలో మోదీపై గుస్సా

ఆస్క్ మోదీ పేరుతో బైడెన్ కు ఛాలెంజ్

ASK Modi Protest : ప్ర‌పంచ వ్యాప్తంగా జేజేలు అందుకుంటున్న భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న ప్ర‌స్తుతం అమెరికా పర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఐక్య రాజ్య స‌మితిలో యోగా దినోత్స‌వం సంద‌ర్బంగా హోస్ట్ చేశారు. ఇదే స‌మ‌యంలో ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ , ప్ర‌థ‌మ మ‌హిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేర‌కు వాషింగ్ట‌న్ డీసీకి చేరుకున్నారు. వైట్ హౌస్ లో విందుకు ఆహ్వానం అంద‌డంతో యుఎస్ కు చేరుకున్నారు. ప్ర‌ధాన‌మంత్రికి గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భించింది.

ఆస్క్ మోదీ పేరుతో ఏకంగా అమెరికా న‌గ‌ర వీధుల్లో ఆందోళ‌న‌కారులు వాహ‌నాల ద్వారా నిర‌స‌న వ్య‌క్తం చేశారు. 2005 నుండి 2014 వ‌ర‌కు యుఎస్ఏ నుండి ఎందుకు మోదీని(Modi) నిషేధించారో బైడెన్ అడ‌గాల‌ని డిమాండ్ చేశారు. ఆనాటి నియంత హిట్ట‌ర్ ను ఆద‌ర్శంగా తీసుకున్న రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ పారా మిలిట‌రీ ప్రైవేట్ సైన్యంతో అలంక‌రించ బ‌డ్డారంటూ ఆరోపించారు. 2002లో గుజ‌రాత్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో ముస్లింల ఊచ‌కోత‌కు కార‌కుడ‌య్యాడంటూ మండిప‌డ్డారు. ఆయ‌న‌కు ఇక్క‌డ ఎందుకు స్వాగ‌తం ప‌ల‌కాల‌ని ప్ర‌శ్నించారు.

అమెరికాకు చెందిన ర‌చ‌యిత‌, ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్ పీట‌ర్ ఫ్రెడ‌రిచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆస్క్ మోదీ పేరుతో ఆయ‌న ఫోటోల‌ను షేర్ చేశారు ట్విట్ట‌ర్ లో. ప్ర‌స్తుత‌, చారిత్ర‌క వ్య‌వ‌హారాలపై ప‌ట్టు క‌లిగి ఉన్నారు. హిందూ జాతీయ వాద స‌మ‌స్య‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు పీట‌ర్ ఫ్రెడ‌రిచ్. ద్వేష పూరిత రాజ‌కీయాల‌ను ప్ర‌శ్నిస్తూ వ‌స్తున్నారు.

Also Read : Bandi Sanjay : ఇంటింటికీ బీజేపీ కార్య‌క్ర‌మం

 

Leave A Reply

Your Email Id will not be published!