Assam CM : కేజ్రీవాల్ పై హిమంత బిస్వా శ‌ర్మ‌ క‌న్నెర్ర‌

హోం వ‌ర్క్ లేకుండా కామెంట్ చేయొద్దు

Assam CM : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌. ఆధారాలు లేకుండా హోం వ‌ర్క్ లేకుండా వ్యాఖ్యానించ వ‌ద్ద‌ని సూచించారు.

ఈశాన్య రాష్ట్రంలో 2013 నుంచి 6,802 ప్రైవేట్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు, 1589 ప్రైవేట్ సెకండ‌రీ పాఠ‌శాల‌లు ప్రాంతీయీక‌రించ‌బ‌డ్డాయి అని పేర్కొన్నారు సీఎం.

రాష్ట్ర మాధ్య‌మిక విద్యా శాఖ అధికారి ప్ర‌కారం మూసి వేసిన బ‌డుల‌ను స‌మీపంలో ఉన్న ఇత‌ర ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌తో విలీనం చేస్తార‌ని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల‌కు వాటిలో వ‌స‌తి క‌ల్పిస్తారని తెలిపారు.

ఈ ఏడాది 10 త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో సున్నా విజ‌యం సాధించ‌డం కోసం 34 స్కూళ్ల‌ను మూసేయ‌డంపై చేసిన కామెంట్స్ పై హిమంత బిస్వా శ‌ర్మ స్పందించారు. సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పై ఎదురుదాడికి దిగారు.

ప‌దో త‌ర‌గ‌తి బోర్డుల‌లో విద్యార్థ‌లంతా ఫెయిల్ కావ‌డంతో 34 పాఠ‌శాల‌ల‌ను మూసి వేయాల‌ని అస్సాం ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

అస్సాం ప్ర‌భుత్వం చ‌ర్య‌పై స్పందిస్తూ దేశ వ్యాప్తంగా అనేక కొత్త పాఠ‌శాల‌లు తెర‌వాల్సిన అవ‌స‌రం ఉన్నందున బ‌డుల‌ను మూసి వేయ‌డం ప‌రిష్కారం కాద‌ని అర‌వింద్ కేజ్రీవాల్ మండిప‌డ్డారు.

పాఠ‌శాల‌ల‌ను మూసి వేసేందుకు బ‌దులుగా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అస్సాం స‌ర్కార్ కృషి చేయాల‌ని సూచించారు సీఎం. దీనికి రియాక్ట్ అయ్యారు బిస్వా శ‌ర్మ‌(Assam CM).

తాను విద్యా శాఖ మంత్రి గా ప‌ని చేసిన రోజుల నుడి ఇప్ప‌టి వ‌ర‌కు 8,610 కొత్త బ‌డులు ఏర్పాటు చేశామ‌న్నారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మాను కోవాల‌ని హిత‌వు ప‌లికారు అస్సాం సీఎం.

Also Read : యూపీఏ స‌మావేశానికి హేమంత్ సోరేన్ పిలుపు

Leave A Reply

Your Email Id will not be published!