Assam CM : సావర్కర్ ను విమర్శించే హక్కు లేదు – సీఎం
రాహుల్ గాంధీపై హిమంత బిస్వా శర్మ ఫైర్
Assam CM : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ నిప్పులు చెరిగారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్దాంతకర వీర సావర్కర్ దేశ ద్రోహి అంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
సావర్కర్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. సావర్కర్ ను ప్రశ్నించడం మహా పాపమన్నారు సీఎం.
ఇదిలా ఉండగా మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ , సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులకు వీర సావర్కర్ ద్రోహం చేశాడంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి ఆనాడు సావర్కర్ రాసిన లేఖను విడుదల చేశారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
కాగా 600 సంవత్సరాలకు పైగా అస్సాంను పాలించిన అహోం రాజ వంశానికి చెందిన లెజండరీ జనరల్ లచిత్ బర్పుకాన్ 400వ వార్షికోత్సవం సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ(Assam CM) హాజరయ్యారు.
సీఎం మాట్లాడుతూ మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాన్ని ఎప్పటికీ జయించ లేరని ..చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే వామపక్ష చరిత్రకారులు మొఘల్ చక్రవర్తులు యావత్ భారత దేశాన్ని వక్రీకరించారని ఆరోపించారు.
సావర్కర్ గురించి తెలిసిన వాళ్లు అలా ఆరోపణలు చేయరని అన్నారు. ఆయన పదేళ్ల పాటు దేశం కోసం జైలులో ఉన్నారని గుర్తు చేశారు సీఎం.
Also Read : కోష్యారీ కామెంట్స్ రౌత్ సీరియస్