Child Marriages Assam CM : బాల్య వివాహాల‌పై అస్సాం ఉక్కుపాదం

స్ప‌ష్టం చేసిన సీఎం హిమంత బిస్వా శ‌ర్మ

Child Marriages Assam CM : అస్సాంలో బాల్య వివాహాల‌పై ఉక్కుపాదం మోపారు సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌. గ‌తంలో ఏలిన పాల‌కులు వీటి గురించి ప‌ట్టించు కోలేద‌న్నారు . వ‌చ్చే 2026 నాటికి రాష్ట్రంలో బాల్య వివాహాలు అనేది లేకుండా చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇందుకు సంబంధించి త‌మ ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌ని పేర్కొన్నారు సీఎం. అస్సాంలో బాల్య వివాహాల‌కు(Child Marriages Assam CM) వ్య‌తిరేకంగా ఉద్య‌మం తీవ్ర‌త‌రం అవుతుంద‌ని చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 98 మందికి మాత్ర‌మే బెయిల్ ల‌భించింద‌ని చెప్పారు హిమంత బిస్వా శ‌ర్మ‌.

రాష్ట్రంలో బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా కొన‌సాగుతున్న డ్రైవ్ ను మ‌రింత ఉధృతం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ఈ అంశం అత్యంత ప్ర‌భావితం చేస్తుంది. దీని వ‌ల్ల ఎంతో మంది అమాయ‌క బాలిక‌లు త‌మ విలువైన జీవితాన్ని కోల్పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో చ‌ర్చించిన‌ట్లు చెప్పారు. గ‌తంలో పెళ్లి చేసుకున్న వారితో పాటు ఇటీవ‌ల బాల్య వివాహాలు చేసుకున్న వారు ఇప్పుడు వాటిని ర‌ద్దు చేసుకుంటున్నార‌ని ఇది శుభ ప‌రిణామ‌మ‌ని అన్నారు హిమంత బిస్వా శ‌ర్మ‌.

పెళ్లి కూతురికి 18 ఏళ్లు నిండితేనే ముందుకు రావాలి. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిని పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏ మాత్రం ఆ వ‌య‌స్సు కంటే త‌క్కువ‌గా ఉంటే వెంట‌నే కేసు న‌మోదు చేస్తున్నారు. బాల్య వివాహాల‌కు సంబంధించి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నార‌ని ఇందులో ఎక్క‌డా రాజీప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు 3 వేల మందికి పైగా అరెస్ట్ చేసింద‌ని చెప్పారు హిమంత బిస్వా శ‌ర్మ‌.

Also Read : మ‌నీష్ సిసోడియాకు సీబీఐ పిలుపు

Leave A Reply

Your Email Id will not be published!