Raghav Chadha : అసెంబ్లీ వ్య‌వ‌హారాలు గ‌వ‌ర్న‌ర్ డొమైన్ కాదు

పంజాబ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు రాఘవ్ చ‌ద్దా

Raghav Chadha : పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ కు మ‌ధ్య దూరం మ‌రింత పెరుగుతోంది. ఒక‌రిపై మరొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తున్నారు.

అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం భ‌గ‌వంత్ మాన్ . దీనిని నిర్వ‌హించ కూడ‌దంటూ గ‌వ‌ర్న‌ర్ ఆదేశించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

శాస‌న‌స‌భ స‌మావేశాలు గ‌వ‌ర్న‌ర్ డొమైన్ కాదంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పంజాబ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు రాఘ‌వ్ చ‌ద్దా. త‌న ప‌ద‌వికి ఉన్న గౌర‌వాన్ని కాపాడు కోవ‌డం లేదంటూ మండిప‌డ్డారు.

తాము భార‌త రాజ్యాంగానికి లోబ‌డి ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఎన్నిక‌య్యామ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ అటు ఢిల్లీలో ఇటు పంజాబ్ లో ప్ర‌భుత్వాల‌ను ఇబ్బందుల‌కు గురి చేసే ప్ర‌య‌త్నం చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha).

అందులో భాగంగానే పంజాబ్ ఆప్ ప్ర‌భుత్వాన్ని కావాల‌ని బ‌ద్నాం చేసే ఉద్దేశంతోనే గ‌వ‌ర్న‌ర్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.

బ‌న్వ‌రీలాల్ రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న బన్వ‌రీలాల్ పురోహిత్ వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని పార్టీ ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాఘ‌వ చ‌ద్దా.

శాస‌న‌స‌భ అనేది వ్యాపార వ‌స్తువు కాద‌న్నారు. బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ, స్పీక‌ర్, గ‌వ‌ర్న‌ర్ కు ప్ర‌త్యేక డొమైన్ మాత్రం కాద‌ని స్ప‌ష్టం చేశారు.

విచిత్రం ఏమిటంటే గ‌త ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన శాస‌న‌స‌భ స‌మావేశాల వివ‌రాలు గ‌వ‌ర్న‌ర్ కావాల‌ని కోర‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha).

Also Read : 2024లో బీజేపీ ముక్త్ భార‌త్ ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!