PM Modi : మారిన స్వరం కొత్త వారికి అవకాశం – పీఎం
సభ సజావుగా సాగేందుకు సహకరించండి
PM Modi : త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయా. ఆ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రూట్ మ్యాప్ సిద్దం చేసుకుంటున్నారా. ఆయన మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. ఆయన నమ్ముకున్న దైవానికి లేదా తనను నమ్ముకున్న అమిత్ షాకు తప్ప.
బుధవారం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా సభ ప్రారంభం కంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సమావేశాలు అత్యంత ముఖ్యమైనవని, సభా సాంప్రదాయాలు పాటిస్తూనే సజావుగా సాగేందుకు సభ్యులు (ఎంపీలు) సహకరించాలని ప్రధానమంత్రి కోరారు.
ప్రధానంగా ఆయన విపక్షాలను కోరడం విస్తు పోయేలా చేసింది. సామాన్యంగా మోదీ(PM Modi) ఒకరు చెబితే వినాలని అనుకోరు. తాను చెప్పింది మాత్రమే వినాలని కోరుకుంటారు. తన పట్ల, పార్టీ పట్ల వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ఇలా చేశారన్న విమర్శలు లేక పోలేదు.
ప్రస్తుతం భారత దేశం జి20 గ్రూప్ కు సారథ్యం వహిస్తోంది. ఇప్పటికే ఆల్ పార్టీలతో మీటింగ్ కూడా పెట్టారు ఢిల్లీలో. అన్ని పార్టీలను ఆహ్వానించారు. ఈ కీలక సమావేశానికి తెలంగాణ సీఎం డుమ్మా కొట్టారు.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోదీ(PM Modi) . కొత్తగా ఎన్నికైన ఎంపీలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. వారికి కూడా సభలో సమస్యలు ప్రస్తావించేందుకు సభాపతులు ఆలోచించాలని సూచించారు.
జీ20 సమ్మిట్ కేవలం దౌత్య కార్యక్రమం కాదు. ఇది భారత దేశ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు ఒక సదవకాశమని అన్నారు నరేంద్ర మోదీ. 16 బిల్లులను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం.
Also Read : ఢిల్లీ బల్దియాలో బీజేపీ ఆప్ నువ్వా నేనా