Atchannaidu : విజయవాడ – టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం కక్ష సాధింపుతోనే తమ పార్టీ చీఫ్ ,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు.
ఆదివారం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. జగన్ సైకోగా మారాడని, తన కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు తమకు కూడా వస్తుందన్నారు.
Atchannaidu Comments Viral
ఇదిలా ఉండగా అచ్చెన్నాయుడు(Atchannaidu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు అరెస్ట్ అయినా ఎందుకని పార్టీకి చెందిన కార్యకర్తలు రోడ్లపైకి రావడం లేదంటూ ప్రశ్నించారు.
వెంటనే జన సమీకరణ చేయాలని నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఆడియో లీక్ కావడం కలకలం రేపింది. పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలిచాలని నాయకులను ఆదేశించారు.
విచిత్రం ఏమిటంటే మహిళలను తీసుకు వస్తే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయరంటూ చెప్పడం విస్తు పోయేలా చేసింది. మరో వైపు విజయవాడ నుంచి రాజమండ్రి వరకు వెళ్లే రహదారి పొడవునా వాహనాలను క్లియర్ చేస్తున్నారు.
బహుశా చంద్రబాబు నాయుడుని విచారించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు టాక్.
Also Read : Chandrababu Naidu : అమాయకుడిని అరెస్ట్ చేస్తారా
