Atchannaidu : అప్పలరాజుపై అచ్చెన్న ఆగ్రహం
అక్రమాలు, దౌర్జన్యాలకు అడ్డు లేదు
Atchannaidu : ఏపీ మంత్రిపై అప్పలరాజుపై నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కింజారపు అచ్చెన్నాయుడు. ఆయన చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో తమ నేత నాగరాజు ఇంటి ముందు ఉన్న కల్వర్టు కూల్చి వేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
నికృష్ణులు, పాలకులు అయితే పాలన ఇలాగే ఉంటుందని ధ్వజమెత్తారు అచ్చెన్నాయుడు(Atchannaidu). అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాకది నీకిది అనే పద్దతిలో జగన్ సర్కార్ నేతలు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
హైదరాబాద్ , బెంగళూరు, ఇడుపుల పాయలలో నిర్మించిన రాజ ప్రసాదాలకు ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఆనాడు తన తండ్రిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించాడని, ఇప్పుడు ఏపీలో సర్కార్ తన చేతిలో ఉంది కదా అని సర్వ నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు కింజారపు అచ్చెన్నాయుడు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా అని నిలదీశారు.
సీఎంను అడ్డం పెట్టుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చి పోతున్నారంటూ ఆరోపించారు కింజారపు అచ్చెన్నాయుడు. మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమాలను నిరంతరం ఎండగడుతున్నందుకే నియోజకవర్గంలో టీడీపీ నేతలను టార్గెట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Godavari Water : గోదావరి నీళ్లతో కళ కళ