Attacks On Minorities : భారత్ లో మైనార్టీ వర్గాలపై దాడులు
యుఎస్ రిపోర్ట్ నివేదికలో వెల్లడి
Attacks On Minorities : అమెరికా మరోసారి భారత ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. 2021 సంవత్సరం మొత్తం దేశంలో మైనార్టీలపై దాడులు జరిగాయని ఆరోపించింది.
హత్యలు, దాడులు, బెదిరింపులతో సహా మైనార్టీ వర్గాలకు(Attacks On Minorities) చెందిన సభ్యులపై దాడులు జరిగాయని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై కాంగ్రెస్ కు ఇచ్చిన వార్షిక నివేదికలో యుఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ ఆరోపించింది.
కాగా భారత దేశం గతంలో యుఎస్ మత స్వేచ్ఛ పేరుతో ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరించింది. రాజ్యాంగ బద్దంగా సంరక్షించబడిన
హక్కుల గురించి విదేశీ ప్రభుత్వం ఉచ్చరించేందుకు లేదా జోక్యం చేసుకునేందుకు వీలు లేదని కుండ బద్దలు కొట్టింది.
ఈ తరుణంలో తాజాగా మత స్వేచ్ఛ పేరుతో నివేదిక సమర్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్టేట్ డిపార్ట్ మెంట్ ఫాగీ బాటమ్ హెడ్ క్వార్టర్స్ లో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఈ నివేదికను విడుదల చేశారు.
ఈ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా మత స్వేచ్ఛ స్థితి, ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ప్రతి దేశానికి సంబంధించిన పూర్తి
రిపోర్టును ఇందులో పొందు పరిచారు.
భారతీయ పత్రికలు, భారత ప్రభుత్వ నివేదికలలో కనిపించే వివిధ అంశాలను డాక్యుమెంట్ చేస్తుంది. వివిధ లాభాపేక్ష లేని సంస్థలు, మైనార్టీ సంస్థలపై దాడులపై చేసిన ఆరోపణలను కూడా ఉదహరిస్తుంది ఈ నివేదిక.
భారత దేశంలోని హిందువులు, ముస్లింలు ఒకే డిఎన్ఏ కలిగి ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారని నివేదికలో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 12న యూపీలో జరిగిన ఓ సమావేశంలో మునుపటి ప్రభుత్వాలు మైనార్టీ వర్గాలకు(Attacks On Minorities) అనుకూలంగా ఉన్నాయంటూ సీఎం యోగి ఆరోపణలు చేయడాన్ని ప్రస్తావించింది.
సోషల్ మీడియా, ప్రింట్, మీడియాలో హిందూయేతరులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తప్పు పట్టింది. ఎఫ్‌సిఆర్ఏ లైసెన్సులు రద్దు చేయడాన్ని నివేదిక ఎత్తి చూపింది.
Also Read : కాశ్మీర్ లో వలస కార్మికుడి కాల్చివేత