Prof K Jayashankar : సారూ దండం నీకు స‌లాం

తెలంగాణ గాంధీకి నివాళి

Prof K Jayashankar : తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త , తెలంగాణ గాంధీగా పేరు పొందిన ఆచార్య జ‌య‌శంక‌ర్ చేసిన కృషి ఎన‌లేనిది. ఆయ‌న ఎంత‌గానో తెలంగాణ కోసం ప‌రిత‌పించారు. ఊరూరా తిరిగారు. తెలంగాణ ఆవ‌శ్య‌క‌త గురించి విడ‌మ‌రిచి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ దేశ విముక్తి కోసం గాంధీ ఎంత‌గా ప‌రిత‌పించారో అలాగే జ‌య‌శంక‌ర్ సారు కూడా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎంత‌గా ద‌గాకు గురైందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించారు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేశారు. ఇవాళ ఆయ‌న పెట్టిన భిక్ష‌నే ఈ తెలంగాణ.

ఆచార్య కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్(K Jayashankar) హ‌న్మ‌కొండ జిల్లా ఆత్మ‌కూరు మండ‌లం పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేట‌లో ఆగ‌స్టు 6, 1934 న పుట్టారు. తెలుగు, ఉర్దూ, హిందీ , ఇంగ్లీష్ భాష‌ల్లో అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌ను క‌లిగి ఉన్నార‌ను. తెలంగాణ ఉద్య‌మానికి త‌న జీవితాన్ని అంకితం చేసిన మ‌హ‌నీయుడు. పుట్టిన‌ప్ప‌టి నుంచి తుది శ్వాస విడిచేంత దాకా ఆచార్య జ‌య‌శంక‌ర్ బ్ర‌హ్మ‌చారిగా ఉన్నారు. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ప్రిన్సిపాల్ గా, రిజిస్ట్రార్ గా, కాక‌తీయ విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స్ ల‌ర్ గా ప‌ని చేశారు. ఎన్నో ఉన్న‌త ప‌ద‌వులు చేప‌ట్టిన ఘ‌న‌త ఆచార్య జ‌య‌శంక‌ర్ సారుది.

1969 తెలంగాణ ఉద్య‌మంలో, అంత‌కు ముందు నాన్ ముల్కీ పోరాటంలో , సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ నిర‌స‌న‌లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఏర్పాటులో కేసీఆర్ కు స‌ల‌హాదారుగా, మార్గ‌ద‌ర్శిగా వెన్నంటి నిలిచారు. ప్ర‌త్యేక తెలంగాణ ఎందుకు కావాల‌నే దానిపై ఆధారాల‌తో స‌హా ఎన్నో పుస్త‌కాలు రాశారు. జ‌నాన్ని చైత‌న్య‌వంతం చేశారు. తెలంగాణ ఏర్పాటును చూడ‌కుండానే 2011 జూన్ 21న లోకాన్ని వీడారు.

Also Read : RS Praveen Kumar Comment : అత‌డే సార‌థి ఆర్ఎస్పీ వార‌ధి

 

Leave A Reply

Your Email Id will not be published!