Aung San Suu Kyi : ఓటింగ్ లో మోసం సూకీకి 3 ఏళ్ల శిక్ష
మయన్మార్ కోర్టు కోలుకోలేని షాక్
Aung San Suu Kyi : మయన్మార్ ప్రజా నాయకురాలిగా పేరొందిన ఆంగ్ సాన్ సూకీకి(Aung San Suu Kyi) కోలుకోలేని షాక్ తగిలింది. ఓటింగ్ లో మోసం చేసినందుకు మయన్మార్ కోర్టు సూకకీకి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
వాకీ టాకీలను అక్రమంగా దిగుమతి చేసుకోవడం , కలిగి ఉండటం, కరోనా వైరస్ పరిమితులను ఉల్లంఘించడం, దేశ ద్రోహం , ఐదు అవినీతి ఆరోపణలపై సూకీకి ఇప్పటికే 17 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
మయన్మార్ లోని న్యాయస్థానం ఎన్నికల అవకతవకలకు పాల్పడినట్ల తేలిన తర్వాత బహిష్కృత నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి(Aung San Suu Kyi) మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
మిలటరీ ప్రభుత్వం విచారించిన ఇతర నేరాలకు ఆమె ఇప్టపికే శిక్ష అనుభవిస్తూ వస్తున్నారు. తాజా తీర్పు సుకీకి సంబంధించిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రటిక్ పార్టీని 2023కి సైన్యం వాగ్ధానం చేసిన కొత్త ఎన్నికలకు ముందు రద్దు చేయాలన్న ప్రభుత్వం స్పష్టమైన బెదిరింపులకు దిగిందని ఆరోపణలున్నాయి.
సూకీ పార్టీ 2020 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. అయితే సైన్యం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరి లో అధికారాన్ని చేజిక్కించుకుంది.
స్వతంత్ర ఎన్నికల పరిశీలకులు ఎటువంటి పెద్ద అవకతవకలను కనుగొనలేదు. కానీ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో మోసం జరిగిందంటూ ఆరోపించింది.
దీని కారణంగా చర్యలు తీసుకుంటున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా బ్యాంకాక్ కు చెందిన ఏషియన్ నెట్ వర్క్ ఫర్ ఫ్రీ ఎలక్షన్స్ అనే నాన్ పార్టీస్ పోల్ వాచింగ్ గ్రూప్ ప్రతినిధి శుక్రవారం మాట్లాడారు. తాము ఎలాంటి ఎన్నికల మోసాన్ని గమనించ లేదన్నారు.
Also Read : మఠాధిపతి అరెస్ట్ పై సిద్దరామయ్య కామెంట్స్