Australia Favours : వలసదారులకు ఆస్ట్రేలియా ఖుష్ కబర్
వేతనాలు పెంచేందుకు సానుకూలం
Australia Favours : ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. సిబ్బంది కొరత మధ్య తాత్కాలిక నైపుణ్యం కలిగిన వలసదారుల వేతనాన్ని పెంచేందుకు ఓకే చెప్పింది.
ఈ వారం ప్రభుత్వ ఉద్యోగాల సమ్మిట్ లో నైపుణ్యం కలిగిన వలసల అంశం ప్రధాన అంశంగా చర్చకు రానుంది. కొంత మంది తాత్కాలిక వలసదారుల ఆదాయ పరిమితిని ఎత్తి వేసేందుకు ఆస్ట్రేలియా అనుకూలంగా ఉంది.
తమ దేశంలో పని చేస్తున్న వారికి, దేశానికి బతుకు దెరువు కోసం వచ్చే వారికి ఇది ఒక రకంగా శుభవార్త అని చెప్పక తప్పదు. ఈ దిశగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆస్ట్రేలియా(Australia Favours) ప్రభుత్వానికి చెందిన నైపుణ్యాలు, శిక్షణ శాఖ మంత్రి బ్రెండన్ ఓ కానర్ వెల్లడించారు.
ఇది కార్మికుల విస్తృత కొరతను పరిష్కరించేందుకు పని చేస్తుందన్నారు. నైపుణ్యం కలిగిన వలసల సమస్య ఈ వారం ప్రభుత్వ ఉద్యోగాల సదస్సులో కేంద్రీకృతమై ఉంది.
ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బీనీస్ దేశానికి సంబంధించి కీలక ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు యజమానులు, యూనియన్ల మధ్య రాజీ కుదుర్చు కోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
సిబ్బంది కొరతతో వ్యాపారాలకు సాయం చేసేందుకు , స్వల్ప కాలిక కార్మికులపై ఆధారపడటాన్ని సులభతరం చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో శాశ్వత వలసదారులను 1,95,000కి ఎత్తి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Also Read : జో బైడెన్ అమెరికాకు శాపం – ట్రంప్