Australia Increases : పర్మినెంట్ వీసాలకు ఆస్ట్రేలియా ఓకే
35,000 నుంచి 1,95,000లకు వీసాల పెంపు
Australia Increases : ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పర్మినెంట్ వీసాల విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ప్రతిభ కలిగిన వారిని తమ దేశం వైపు చూసేలా, వారు ఇక్కడికి వచ్చి పని చేసుకునేలా నిబంధనలు సడలించేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు శాశ్వత వలస వీసాలను పెంచింది.
గతంలో 35,000 మాత్రమే ఉండేది. కానీ వాటిని 1,95,000 వరకు పెంచాలని డిసైడ్ చేసింది. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక వలసదారుల వైపు దృష్టి సారించేలా చేస్తుంది.
కార్మికుల ఒత్తిళ్ల మధ్య ఆస్ట్రేలియా శాశ్వత వలసల సంఖ్యను పెంచడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పర్మినెంట్ వీసాల సంఖ్యను పెంచేందుకు మొగ్గు చూపింది.
దేశంలోని వివిధ రంగాలలో అత్యధికంగా మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది ఆ దేశం. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా(Australia Increases) సర్కార్ స్పష్టం చేసింది.
దీని వల్ల అత్యధికంగా భారత్ కు చెందిన నిపుణులకు మరింత గిరాకీ కలుగుతుంది. పర్మినెంట్ వీసాల జారీ పెంపుదల వల్ల వ్యాపారాలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.
కరోనా కష్ట కాలంలో ఆస్ట్రేలియా తన సరిహద్దులను రెండు ఏళ్ల పాటు మూసి వేసింది. కాగా కఠినమైన నియమాలు, కార్మికులు, విదేశీ విద్యార్థుల వలసలు ఎక్కువ ప్రభావానికి గురయ్యాయి.
ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఉత్పాదకత పెరగాలంటే నైపుణ్యం కలిగిన వారికి చాన్స్ ఇవ్వాల్సిందే. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నాయంటూ పేర్కొన్నారు మంత్రి క్లేర్ ఓనీల్.
Also Read : స్టార్ బక్స్ సిఇఓగా లక్ష్మణ్ నరసింహన్