Jaya Kishori : కంటెంట్ ఉన్నోళ్ల‌కు గుర్తింపు ఉంటుంది

మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ జ‌యా కిషోరి కామెంట్స్

Jaya Kishori : ఈ దేశంలో ప్ర‌తిభావంతుల‌కు కొదువ లేదు. లెక్క‌లేనంత మంది ర‌చ‌యిత‌లు, క‌వులు, క‌ళాకారులు, ఆధ్యాత్మిక‌వేత్త‌లు, మోటివేష‌న‌ల్ స్పీకర్స్ , శిక్ష‌కులు త‌మ‌దైన శైలిలో భార‌త్ ను ఆవిష్క‌రిస్తున్నారు. వారిలో మోస్ట్ పాపుల‌ర్ స్పీక‌ర్ గా పేరొందారు జ‌య కిషోరి(Jaya Kishori) . ఆమె ప్ర‌ధానంగా భ‌గ‌వ‌త్ గీత‌ను ఆధారంగా చేసుకుని చిన్న చిన్న క‌థ‌ల ద్వారా ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేస్తూ వుంటారు.

కుటుంబం అత్యంత ముఖ్య‌మ‌ని పేర్కొంటారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆదివారం ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది 2022కు గాను ది గ్రేట్ ఇండియ‌న్ రైట‌ర్స్ అవార్డు పొందిన ర‌చ‌యిత‌ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఎ సిండ్రెల్లా ఆఫ్ క‌ర్నాల్ అనే పేరుతో రాసిన రిచా అగ‌ర్వాల్ గోయ‌ల్ , అభిజిత్ బి పాటిల్ రాసిన నేను మ‌త్య చేయ‌బ‌డ్డాను , న‌మ్ర‌తా గుప్తా రాసిన తెల్ల‌టి గుర్రాలు చీక‌టి నీడ‌లు అనే పుస్త‌కాల‌కు బెస్ట్ అవార్డులు అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎక్కువ‌గా క‌థ‌లు, న‌వ‌ల‌లు, స్పూర్తి దాయ‌కంగా ఉండే వారి నుంచి మంచిని స్వీక‌రించి అంద‌మైన రూపంలో చెబుతూ వ‌స్తారు జ‌యా కిషోరి. ఈ సంద‌ర్భంగా నేటి యువ‌తీ యువ‌కుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు ఆమె(Jaya Kishori) .

జీవితంలో ఏదైనా సాధించాలంటే ఏకాగ్ర‌త ముఖ్య‌మ‌ని, దానిని కోల్పోతే దేనిని నేర్చుకోలేమ‌ని పేర్కొన్నారు. పుస్త‌కాల‌ను సాధ్య‌మైనంత మేర చ‌ద‌వాల‌ని సూచిస్తున్నారు జ‌య కిషోరి. అయితే కంటెంట్ ఉన్న వాళ్ల‌కు గుర్తింపు త‌ప్ప‌క ల‌భిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆమెకు వేలాది మంది అభిమానులు ఉన్నారు.

Also Read : స‌ర్టిఫికెట్ ఉంటేనే స్వామి దర్శ‌నం

Leave A Reply

Your Email Id will not be published!