Ayutha Chandi Yagam : అంగరంగ వైభోగం అతిరుద్ర యాగం
శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ
Ayutha Chandi Yagam : శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ సంకల్పంతో జడ్చర్ల పట్టణంలో నిర్వహిస్తున్న అయుత అతిరుద్ర చండీ యాగం(Ayutha Chandi Yagam) అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతోంది. ఆగస్టు 27 వరకు 80వ విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామి వారి ఆశీస్సులు అందుకుంటున్నారు. ప్రతి రోజూ పూజలు జరుగుతున్నాయి.
Ayutha Chandi Yagam Viral
శనివారం స్వామి వారి ఆధ్వర్యంలో యాగశాల ప్రదక్షిణ చేపట్టారు. అనంతరం గణపతి పూజ శ్రీ లక్ష్మి నృసింహ సహిత సుదర్శన, లక్ష్మి నారాయణ, నవగ్రహ మరియు సంతాన లక్ష్మి హోమములు నిర్వహించారు. ఇవాళ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ పెద్ద ఎత్తున సామూహిక కుంకుమ అర్చన నిర్వహించారు. శ్రీ భూనీళా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా కొనసాగనుంది. దీంతో పాటు లక్ష బిల్వార్చన, రుద్రాక్ష మార్చన కొనసాగనుంది.
20న ఆదివారం ఉదయం 7 గంటలకు సూర్య , సరస్వతి, ధైర్యలక్ష్మీ హోమాలు, విశేష సూర్య నమస్కారాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు సరస్వతి పూజలు, బాల పూజలు నిర్వహిస్తారు.
21న సోమవారం(Monday) ఉదయం 7 గంటలకు మృత్యుంజయ రుద్ర హోమాలు, విజయ లక్ష్మీ హోమం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు దశ సహస్ర విశేష అభిషేకాలు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లు