Ayutha Chandi Yagam : వైభవోపేతం అతిరుద్ర యాగం
శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద
Ayutha Chandi Yagam : శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ(Sri Sri Sri Krishnajyoti Swaroopananda Swamiji) ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో నిర్వహిస్తు్న్న 80వ విశ్వ శాంతి మహాయాగ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. యాగ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వామి వారి ఆశీస్సులకు పాత్రులవుతున్నారు. అతిరుద్ర యాగం ఆగస్టు 27 వరకు కొనసాగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పూజాది కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
Ayutha Chandi Yagam Got Viral
ప్రతి రోజూ యాగ నిర్వహణలో భాగంగా స్వామి వారి పర్యవేక్షణలో ఉదయం 7 గంటలకు గోపూజ, 7.30 గంటలకు తులసి పూజ, 9 గంటలకు సహస్ర లింగార్చన, రుద్రాభిషేకం, 10 గంటలకు కోటి కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు విష్ణు సహస్ర నామం, లలిత సహస్ర నామం, సౌందర్య లహరి పారాయణం, 2 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు , రాత్రి 7 గంటలకు రుద్రక్రమార్చన, లక్ష బిల్వార్చన, 8.30 గంటలకు తీర్థ ప్రసాద కార్యక్రమం కొనసాగుతోంది.
గురువారం ఉదయం 7 గంటలకు శ్రీలక్ష్మీ కుబేరం అష్టలక్ష్మీ ధాన్య లక్ష్మీ హోమాలు చేపట్టారు. .18న శుక్రవారం ఉదయం 7 గంటలకు విశేష చండీ సహిత గజలక్ష్మీ హోమాలు , సాయంత్రం 6 గంటలకు సామూహిక విశేష లక్ష్మీ కుంకుమార్చన, లక్ష గాజులార్చనలు నిర్వహించనున్నారు.
19న శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ సహిత సుదర్శన, లక్ష్మీనారాయణ నవగ్రహ, సంతాన లక్ష్మీ హోమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, లక్ష బిల్వార్చన, రుద్రాక్ష మార్చన జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.
Also Read : TPCC FEES : పోటీ చేయాలంటే ఫీజు కట్టాల్సిందే