Jairam Ramesh Azad : ఆజాద్ పార్టీ క‌నుమ‌రుగు ఖాయం

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేష్

Jairam Ramesh Azad : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మీడియా ఇంచార్జ్ జైరాం ర‌మేష్(Jairam Ramesh) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న కేంద్ర మాజీ మంత్రి గులాం న‌బీ ఆజాద్ పై నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండ‌గా గులాం న‌బీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీతో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు. కొత్త పార్టీని పెట్టారు. ప‌లువురు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.

ఇదే స‌మ‌యంలో క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ కు కాంగ్రెస్ యువ నాయ‌కుడు రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. దీనికి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడిన వారంతా తిరిగి పాత పార్టీకి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఆజాద్ పార్టీలో చేరిన 17 మంది సీనియ‌ర్ నాయ‌కులు ఆ పార్టీని వీడారు.

ఈ సంద‌ర్భంగా జైరాం ర‌మేష్(Jairam Ramesh) ఇవాళ మీడియాతో మాట్లాడారు. గులాం న‌బీ ఆజాద్ స్థాపించిన పార్టీ క‌నుమ‌రుగు కావ‌డం ఖాయ‌మ‌న్నారు. మ‌రికొంద‌రు కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నార‌ని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ప‌లువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్ , పీర్జాదా మ‌హ్మ‌ద్ స‌యీద్ గులాం న‌బీ ఆజాద్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు.

తాము ప‌ని చేయ‌లేమంటూ ప్ర‌క‌టించారు. త‌మ‌కు ముందు నుంచి స‌పోర్ట్ గా ఉంటూ వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీనే న‌మ్ముకున్నామ‌ని పేర్కొన్నారు. ఈ త‌రుణంలో రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర 135 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజ‌న్ లాగా ఉప‌యోగ ప‌డింది.

Also Read : బ్ర‌హ్మ‌ర‌థం మోదీపై పూల వ‌ర్షం

Leave A Reply

Your Email Id will not be published!